రాజధాని ఏమైనా బ్రహ్మ పదార్థమా..? మంత్రి బొత్స
TeluguStop.com
రాజధానిలో పేదలు ఇళ్లు కట్టుకోకూడదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.రాజధాని ఏమైనా బ్రహ్మ పదార్థమా అన్న ఆయన కేపిటల్ అంశంలో కోర్టు తీర్పు ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు.
మరోవైపు మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా ఇళ్లకి చేర్చామని చెప్పారు.ఉనికి కోసమే రైతుల పేరుతో చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తోందని వెల్లడించారు.
రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!