యాదాద్రి హిల్స్ అక్రమ బ్లాస్టింగులను వెంటనే ఆపాలని ఆందోళన

యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి,రాజాపేట మండలాల పరిధిలోని దత్తాయపల్లి,చల్లూరు గ్రామాల శివారు భూముల్లో ఇటీవల అక్రమంగా వెలసిన యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని,సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి యాదాద్రి హిల్స్ వెంచర్ అక్రమ బ్లాస్టింగులపై విచారణ చేపట్టాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

సోమవారం వెంచర్ ఎదుట గ్రామస్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగ,దౌర్జన్యంగా వెంచర్ ఏర్పాటు చేస్తూ అక్రమంగా బ్లాస్టింగులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో వెంచర్ కాంపౌండ్ వాల్ గోడలు కూలి పచ్చటి పంట పొలాలు నాశమయ్యాయని,ఈ సంఘటనలో స్థానిక రైతులు తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు.

ప్రజాప్రతినిధులకు,అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రిపగళ్ళు చేస్తున్న బ్లాస్టింగులతో జనం బెంబేలెత్తుతున్నారని,ఇళ్లల్లో ఉండలేక,వ్యవసాయ పొలాల్లో బ్రతుక లేక నిత్య చేస్తూ బ్రతుకుతున్నారని,పెద్ద పెద్ద రాళ్లు వ్యవసాయ పొలాల్లో పడుతూ పచ్చటి పంట చెల్లను సర్వనాశనం చేస్తున్నాయని,బోరు బావులు పూడుక పోయి నీళ్లు రాని పరిస్థితితులు నెలకొన్నాయని,ఇళ్లు పగుళ్లు పడుతున్నాయని చెప్పారు.

అదేవిధంగా దత్తాయపల్లి గ్రామపంచాయతీ పేర రిజిస్ట్రేషన్ చేసిన పది శాతం భూమిని ఆక్రమించి,దౌర్జన్యంగా అడ్డు గోడ నిర్మించి అతి పెద్ద గేటును బిగించి,పంచాయతీ భూమిని సైతం ఆక్రమించి చుట్టూర ఫీనిషింగ్ ఏర్పాటు చేయడంతో రైతులు,ప్రజలు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లనీయకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసి వాళ్లకు పెద్ద,పెద్ద గనులను ఇచ్చి మరీ కాపాల కాస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఇట్టి అక్రమ వెంచర్ పైన ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు,అధికారులు చర్యలకు ఉపక్రమించని పక్షంలో ఆయాగ్రామాల ప్రజలు, రైతులతో కలిసి అఖిల పక్షం ఆధ్వర్యంలో పేద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అఖిల పక్షం నాయకులు,గ్రామ ప్రజలు,యువకులు, రైతులు,గొప్ప సిద్దారెడ్డి,గుంటి మల్లేష్ యాదవ్, జేరిపోతుల కరుణాకర్,ఎర్రగుంట గోవర్ధన్,నీల కొండల్,జిట్ట కిషన్,గాజె ప్రవీణ్,కొడారి శ్రీను,ఎర్రవెల్లి మహేష్,పాల చంద్రయ్య,పాల సాగర్,దానబోయిన మురళి,పల్లపు కృష్ణ,మార్క శివ,తదితరులు పాల్గొన్నారు.

అమ్మాయిల అందాన్ని పెంచే పొద్దుతిరుగుడు.. ఎలా వాడాలంటే..?