మోడీ,కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ మరియు విద్యుత్ ఛార్జీల ధరలను తక్షణమే తగ్గించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచే విధంగా పాలక ప్రభుత్వాలు వ్యవహరించడం శోచనీయమన్నారు.

సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపునకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతూ మరోవైపు ప్రజలపై మోయలేని భారం వేయడం అన్యాయమని అన్నారు.

కొన్ని రాష్ట్రాలు ఇంధనం ధరల విషయంలో ఐదు శాతం భరిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం భరించకుండా ప్రజలపై మోయలేని భారం వేయడం తగదన్నారు.

అరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా ధరలను పెంచలేదని గుర్తు చేశారు.

సత్వరమే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని కోరారు.

దొంగే దొంగా దొంగా అన్న చందంగా బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

సామాన్యులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి భారం మోపుతున్నాయని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎండి షఫీ ఉల్లా,నాయకులు గోదల రంగారెడ్డి,నామ ప్రవీణ్, దొంతిరెడ్డి సైదిరెడ్డి,అబ్ధుల్ రహీం,గట్టు శ్రీను,రమేష్ నాయుడు,స్వామి నాయుడు,కుమ్మరికుంట్ల శ్రీను, ధర్మ,ఫరూక్,పాలకుర్తి వెంకట్,నరెడ్ల సోమయ్య, శ్రీమన్నారాయణ,గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!