మొటిమలతో ఇబ్బందిగా ఉందా ? ఈ చిట్కాలను ఫాలో అయితే సరి

ముఖం మీద మొటిమలు వచ్చాయంటే ముఖం చాలా అసహ్యంగా కనపడుతుంది.వాటిని వదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.

ఆ ప్రయత్నాలలో భాగంగా మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ ని వాడుతూ ఉంటాం.

అయితే ఎటువంటి ప్రయోజనం లేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల ఇంటిలో సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్ధాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.వంటసోడాలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి.బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Style="/* Width: 50%; */display: Inline;" Src="" Alt="" Data-lazy-loaded="true"noscript<img Style="width: 50%; Display: Inline;" Src="" Alt="">/noscript అల్లంలో వాపు వ్యతిరేక, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను సమర్ధవంతంగా తగ్గించటంలో సహాయపడుతుంది.

అల్లం రసంను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

ఇది ముఖంపై జిడ్డును తొలగించటమే కాకుండా మచ్చలను కూడా తొలగిస్తుంది.!--nextpage నల్ల జీలకర్రలో ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ,జింక్ సమృద్ధిగా ఉండుట వలన మొటిమలను తగ్గిస్తుంది.

నల్ల జీలకర్రను పొడిగా చేసి తేనే కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

దాల్చినచెక్క పొడిలో తేనే కలిపి ముఖానికి మాస్క్ వేసుకోవాలి.20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

దాల్చినచెక్క బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కలిగివుంటుంది.తేనె వాపులకి వ్యతిరేకంగా పనిచేసి, చర్మానికి ఉపశమనాన్ని ఇస్తూ తేమను కూడా అందిస్తుంది.

వెంకటేష్ 20 స్టోరీలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటి..?