మెగా అల్లుడి దీపావళి కానుక

మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా వచ్చిన వారు తమ కెరీర్‌లను సెట్ చేసుకుని వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.

కొందరు హిట్లు కొడుతుంటే.మరికొందరు ఫ్లాపులతో సతమతమవుతున్నారు.

అయితే మెగా ఫ్యామిలీలో అల్లుడిగా చేరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ తొలి చిత్రం ‘విజేత’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలిచింది.

అయితే తన నెక్ట్స్ మూవీ కోసం చాలా టైమ్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీతో రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ రెండో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

అక్టోబర్ 26న ఉదయం 11 గంటలకు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

""img "aligncenter" Src="" / కాగా గతంలో కళ్యాణ్ దేవ్ దర్శకుడు పులి వాసు డైరెక్షన్‌లో ‘కండోమ్ ప్యాక్టరీ’ అనే చిత్రం తెరకెక్కుతోందని పుకార్లు వినిపించాయి.

మరి రేపు రిలీజ్ అయ్యే చిత్ర అప్‌డేట్ ఆ చిత్రానికి సంబంధించిందేనా కాదా అనే విషయం రేపు రివీల్ కానుంది.

ఏదేమైనా మెగా అల్లుడు తన నెక్ట్స్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఎన్ని షాంపూలు మార్చిన చుండ్రు పోవడం లేదా.. అయితే ఇది ట్రై చేయండి!