ముఖంపై తెల్ల మ‌చ్చ‌లా? ఈ సింపుల్ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపై అక్క‌డ‌క్క‌డ తెల్ల‌గా మ‌చ్చ‌లు వ‌స్తూ ఉంటాయి.ఇవి చ‌ర్మం రంగు కంటే తెల్ల‌గా, వేరుపాటుగా మ‌రియు ఆస‌హ్యంగా క‌నిపిస్తాయి.

దాంతో వాటిని ఎలా నివారించుకోవాలో అర్థం అవ్వ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే ఏ క్రీములు ప‌డితే ఆ క్రీములు పూస్తూ ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలా సుల‌భంగా తెల్ల మ‌చ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ముందుగా తొక్క తీసిన అల్లాన్ని తీసుకుని మెత్త‌గా దంచి ర‌సం తీసుకోండి.ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టి, రెండు స్పూన్ల అల్లం ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై తెల్ల మ‌చ్చ‌లు ఉన్న చోట ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసి ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాలు పాటు డ్రై అవ్వ‌నివ్వండి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే తెల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా మ‌టుమాయం అవుతాయి.

"""/" / అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర కందిప‌ప్పు పొడి, అర స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, ఒక స్పూన్ క‌ల‌బంద జెల్ మ‌రియు ఒక స్పూన్ తుల‌సి ఆకుల ర‌సం వేసుకుని మిక్స్ చేసుకోండి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని తెల్ల మ‌చ్చ‌ల‌పైనే కాకుండా ఫేస్ మొత్తానికి పూయండి.బాగా ఆరిన త‌ర్వాత ర‌బ్​ చేసుకుంటూ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే తెల్ల మ‌చ్చ‌లే కాదు న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు కూడా త‌గ్గిపోతాయి.

ఇక గుప్పెడు వేపాకులు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని మ‌చ్చ‌ల‌పై పూసుకుని పావు గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజూ చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?