మా దేశానికి రండి “భారతీయుల” కి “యూఏఈ” పిలుపు

అమెరికా భారతీయ టెకీ లపై పెట్టిన ఆంక్షలు.వీసాల విషయంలో పెడుతున్న నిభంధనలతో భారత ఎన్నారై ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.

దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఎంతో మంది భారతీయ ఎన్నారైలకి వివిధ దేశాలు సాదర స్వాగతం పలుకుతున్నాయి.

ఈ జాబితాలో తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వచ్చి చేరింది.కేవలం భారతీయులే కాదు, అసాధారణ ప్రతిభ ఉన్న ఏ దేశం వాళ్లయినా, పదేళ్ల పాటు తమ దేశంలో ఉండేలా వీసా మంజూరు చేసేలా యూఏఈ ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ వృత్తి నిపుణులు, విద్యార్థులు సైతం ఈ వీసాలకి అప్లై చేసుకోవచ్చాన్ని తెలిపింది.

యూఏఈ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.తాజా నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, ప్రతిభ కలిగిన వాళ్లకు యూఏఈ వేదిక అవుతుందని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

‘‘అసాధారణ ప్రతిభ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మా దేశం మంచి వేదికగా మారుతుందని ప్రధాని మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అన్నారు.

ఈ మేరకు ఉత్తర్వులను అమలు చేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

తాజా అయితే ప్రధాని తీసుకున్న నిర్ణయంతో యూఏఈ అనేకమంది పెట్టుబడిదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందని, అన్ని దేశాలతో పోటీ పడి గెలుస్తుందని అన్నారు అయితే ఈ సమయంలో ఎంతో ప్రతిభ కలిగిన భారతీయుల సప్పోర్ట్ కూడా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపారు.

చదువుకోవాలనుకునే అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు అయిదేళ్ల వీసా నివాస వీసాను ఇస్తామని తెలిపారు.

మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?