మహిళ ప్రాణాలు కాపాడిన యువకుడికి సన్మానం చేసిన పోలీసులు
TeluguStop.com
నల్గొండ జిల్లా:అనుముల మండలం హాలియా పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి టెంపుల్ దగ్గర సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ఓ మహిళ ప్రయత్నం చేయగా అటుగా వెళ్తున్న మెకానిక్ మోగుదాల శ్రీను చూసి ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడి హాలియా పోలీసువారికి సమాచారం అందజేశారు.
పోలీస్ వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్ళి మహిళను తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరుడు కేతేపల్లి రవిని పిలిపించి అతనికి అప్పగించారు.
మహిళ ప్రాణాలు కాపాడిన శ్రీనుని పోలీసు స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్ సన్మానించారు.
‘నిన్ను నరికి, మీరట్ స్టైల్‌లో ప్యాక్ చేస్తా’.. భర్తకు భార్య బెదిరింపు.. వీడియో చూస్తే వణికిపోతారు..