మల్లె,గులాబీ,మందారం పూలతో..పేస్ ప్యాక్
TeluguStop.com
పువ్వులని సాదారణంగా అలంకారాలకి ,స్త్రీలు సిగలో పెట్టుకోవడానికి ,సువాసనలకి ఉపయోగిస్తాము.కానీ వాటితో చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి ఉపయోగాపడుతాయి అని చలా మందికి తెలియదు.
నిజానికి పూలు చూస్తూ ఉంటే మనసుకి ఆహ్లాదం కలుగుతుంది.చర్మ కాంతిని మెరుగుపరచడానికి మరియు పోడిబారిన చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయడానికి పూలని వాడుతారు.
మల్లె ,గులాబీలు చర్మ రక్షణకి ఎక్కువగా ఉపయోగిస్తారు.చెంచా మల్లె పూల ముద్దకి ,చెంచా పచ్చి పాలని కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగడం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే గుప్పెడు గులాబీ రేకులు తీసుకుని రెండు చెంచాల నీటిని కలిపి ముద్దగా నూరాలి.
ఈ ముద్దకి గ్లిజరిన్,చెంచా పాలు కలిపి ముఖానికి ,మెడకి రాసుకోవాలి.కాసేపటి తరువాత చల్లని నీళ్ళతో ముఖాన్ని కడిగేయాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.ఇలా చేస్తూ ఉంటే చర్మం మెరిసిపోతుంది.
అలాగే మందార పువ్వుతో జుట్టుని ,చర్మ సౌందర్యాన్ని కాపాదుతుంది.మందారం చర్మంపై ముడతలని నివారిస్తుంది .
రెండు మందార పూల రేకులు,గులాబీ రేకులు ఎనిమిది కలిపి ముద్దలా చేసుకుని .
చెంచా పెరుగు ,ముల్తాని మట్టిని అందులో కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించాలి.
పట్టించిన ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.ఇలా చేయడం వలన చర్మం మీద ఉన్న మచ్చలు పోతాయి.
హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!