మల్లన్నసాగర్ మీద ప్రతిపక్షాలు 300 కేసులు వేశారు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:అభివృద్ధి నిరోధకులకు ప్రజలే  తగిన బుద్ధి చెబుతారని,ప్రజలు ప్రతిపక్షాలని మరిచిపోయారని, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ అని,ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని,60 ఏళ్ళు పాలించి ఏ మాత్రం అబ్బివృద్ది కానీ,ప్రజల బాగోగులు కానీ,సంక్షేమ పథకాలు కానీ చేయలేదని మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

హుజుర్ నగర్ నియోజకవర్గ  కేంద్రంలో ఇంటిగ్రేేటెట్  మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో చేయలేనిది 7 ఏళ్లలో చేసి చూపిస్తుంటే మతి భ్రమించి,దిక్కుతోచక అభివృద్ధిని అడ్డుకొని కేసులు వేసి స్టే తెచ్చి ఆపుతున్నారని,ఇలాంటి  కేసులు ఎన్ని వేసినా అభివృద్ధిని ఏమాత్రం ఆపలేరని,మల్లన్నసాగర్ మీద కూడా 300 కేసులు వీళ్ళే వేశారని,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేకర్ రావు మల్లన్న సాగర్ నిర్మించి చూపించారని,ఎక్కడో పాతాలంలో ఉన్న నీటిని తెలంగాణ నెత్తి మీద నిలబెట్టి చూపించారని, కేసులు వేసి అడ్డుకొంటామని ఆలోచించడం అ అల్పసంతోషమే అవుతుందని తెలియజేశారు.

అదేవిధంగా బూతులు తప్ప సంస్కారం మచ్చుకైనా కానరాని కొంత వికృతమైన వారు కూడా ఉన్నారని,వారు మంచి మర్యాద లేకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటారని,ఈ ఇద్దరు తెలంగాణ అభ్బివృద్ధిని విమర్శలు చేస్తుంటారన్నారు.

కానీ,వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అభివృద్ది మచ్చుకైనా కానరాదని, వీరికి ప్రజల మీద కనీసం ప్రేమ లేదని కాంగ్రెస్,బీజేపీ పార్టీలనుద్దేశించి చురకలు అంటించారు.

ఈరోజు తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఉందని, మరి వారు పరిపాలిస్తున్న గుజరాత్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ 24 సెకండ్లు కూడా ఉచిత కరెంట్  ఇవ్వడం లేదని దెప్పిపొడిచారు.

అంతే కాకుండా ప్రభుత్వం డబ్బులు సంపాదించాలి,ప్రజల కొరకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి దని,15000 కోట్లతో రైతులకు రైతుబంధుని ఇస్తున్నారని,రైతు భీమా ఒక సంజీవిని లాంటి పథకమని మరి ఇలాంటి అభివృద్ధి పథకాలు వారి పాలనలో ఉన్న రాష్ట్రాలలో లేవని,కనీసం కేసీఆర్ ని చూసి అయినా వారు వారి రాష్ట్రాలలో అమలు చేయరని,వారికి ప్రజల మీద ప్రేమ లేదని, అభివృద్ధిని చేసే,ప్రజల కోసం పని చేసే వారిని బధనాం చేసే మాటలు మాట్లాడుతూ వుంటారాని మండిపడ్డారు.

వీరు రాష్ట్రాలకు, ప్రజలకు పట్టిన జలగలని,ప్రజలను ఇన్నాళ్లు పట్టి రక్తం పీల్చారని,వీరి పిడను రాష్ట్రంలో  కేసీఆర్ తొలగించారని తేలియజేశారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ ఉప ఎన్నికలు రావడ శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకు గొప్ప మేలు జరిగినదన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరి వారి రాష్ట్రాలలో చేసి చూపేంచరే అని ప్రశ్నించారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ ఉప ఎన్నికలు రావడ శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకు గొప్ప మేలు జరిగినదన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరి వారి రాష్ట్రాలలో చేసి చూపేంచరే అని ప్రశ్నించారు.

అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో మనకు మనమే పోటీ అని, మతిభ్రమించి కేసులు వేస్తున్న అభివృద్ధి నిరోదకుల మాటలు నమ్మొద్దని తెలిపారు.

హుజుర్ నగర్ కేంద్రంలో ప్రభుత్వ భూమి కేవలం ఈ ఎన్ఎస్పీ క్యాంపు మాత్రమే మిగిలిందని,దీనిని కూడా గత ప్రభుత్వ పాలకులు దగ్గర ఉండి అన్యాక్రాంతం చేశారని, ఇప్పుడు ఎన్ఎస్పి క్యాంప్ లో 7 కోట్లతో 2 ఎకరాలలో ఆరోగ్యవంతమైన శాఖాహార & మాంసాహార ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ఏర్పాటు చేసుకోబోతున్నమని తెలిపారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోయే ప్రయత్నంలో గ్రామాలలో,మండలాలలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల రూపకల్పన జరుపుతుంటే,కొంత మందికి నిద్రపట్టక అభివృద్ధి జరిగితే ఉనికి కోల్పోతామని పనులు జరుగకుండా అడ్డుకోవడానికి ప్రతి పనికి కోర్టు లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చి,పనులకు ఆటంకాలు చేస్తున్నారని ఆరోపించారు.

నేరేడుచర్లలో 15 కోట్లతో,హుజుర్ నగర్ లో 27 కోట్లతో అభివృద్ధి పనులకు కోర్ట్ లో కేసులు వేశారని,మార్కెట్ కూడా ఏర్పాటు కాకుండా  కేసులు వేశారని మండిపడ్డారు.

దీనివలన అభివృద్ధి ఆలస్యం అవుతుండగా,ప్రజలు తీవ్ర అసౌకర్యానికి,ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇలాంటి అభివృద్ధి నిరోధకుల చర్యలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

డ్రై హెయిర్ తో డోంట్ వర్రీ.. ఒక్క వాష్ తో రిపేర్ చేసుకోండిలా!