మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇంట్లోనే ఈ పానీయాలను సులభంగా సిద్ధం చేసుకోండి..!

ప్రస్తుత రోజులలో చాలా మంది ప్రజలు మలబద్ధకం సమస్య( Constipation )ను ఎదుర్కొంటున్నారు.

కొంత మంది అయితే వీటి కోసం మెడిసిన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.మలబద్ధకం చిన్న సమస్య మాత్రం కాదు అని నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల ఫ్యూచర్ లో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా పైల్స్, ప్రేగు, క్యాన్సర్ కూడా వస్తాయి.మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే ఇంట్లోనే ఈ పానీయాలను తీసుకోవడం ద్వారా మీ సమస్య నుంచి త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు.

మలబద్ధకం మరియు ఇతర జీర్ణ వ్యవస్థల9 Digestion ) నుంచి త్వరగా ఉపశమనం పొందడంలో మీకు సహాయపడే అనేక ఇంటి నివారణ చిట్కాలు ఉన్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే పసుపు, దోసకాయ, అరటిపండు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.

"""/" / మలబద్ధకాన్ని నివారించడానికి సులభమైన మార్గం ఎక్కువ ద్రవాలు త్రాగడం( Juuices ) అని నిపుణులు చెబుతున్నారు.

ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ పానీయాలు మీ శరీరం నుంచి అన్ని టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి.

అలాగే జీర్ణ క్రియను మెరుగుపడేలా చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే అధిక ఫైబర్ కంటెంట్ తో తయారు చేసిన స్మూతీలు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.అలాగే పెరుగు, చియా గింజలు( Chia Seeds ) లేదా అవిసె గింజలు మరియు బెర్రీలను కలపడం ద్వారా స్మూతీని తయారు చేయవచ్చు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే కలబంద రసం( Aloevera Juice ) మలబద్ధకం చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

కలబంద రసంలో ప్రేగు కదలికలకు సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక గ్లాసు కలబంద రసం తాగితే మలబద్ధక సమస్య త్వరగా దూరం అవుతుంది.

ఇంకా చెప్పాలంటే నిమ్మరసం చాలా సులభమైన మరియు ప్రభావంతమైన పానీయం అని నిపుణులు చెబుతున్నారు.

దీనిని మలబద్దక సమస్యకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే నిమ్మకాయలలో( Lemon ) విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది పొట్ట సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పది రోజులు మద్యం లేకుండా ఉండాల్సిందేనా..?