మన్యం జిల్లా కొమరాడలో మరోసారి ఒంటరి ఏనుగు హల్ చల్
TeluguStop.com
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఒంటరి ఏనుగు మరోసారి హల్ చల్ చేసింది.
మండలంలో సంచరిస్తున్న గజరాజు విక్రంపురం దగ్గర రైల్వే గేటును ధ్వంసం చేసింది.దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఒంటరి ఏనుగు సంచారంతో మండలంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.అదేవిధంగా ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025