మతోన్మాదుల నుండి రాజ్యాంగాన్నిరక్షించుకోవాలి

నల్లగొండ జిల్లా:దేశంలో మతోన్మాధుల పెరుగుదల రాజ్యాంగానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, వారి నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.

స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.శనివారం నల్గొండ దొడ్డి కోమరయ్య హాల్ లో కేవీపీఎస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ పథకం ప్రకారమే దళితులకు ఉండబడిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ రిజర్వేషన్లకు సమాధి చేస్తుందన్నారు.దళితుల ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ నోటికాడి బుక్క లాగేస్తుందన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వి మాటలు అయితే బీజేపీకి రాజకీయ సైద్ధాంతిక పునాది ఉందన్నారు.

బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని,స్వాతంత్ర్య జెండాను ఎప్పుడు గౌరవించలేదన్నారు.వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని సమిక్షించడానికి ఒక ప్రత్యేక కమీషన్ వేసిందని,రాజ్యాంగం మా పవిత్ర గ్రంధం కాదు భగవత్ గీత మా పవిత్ర గ్రంధమని నాడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటిoచిందని గుర్తు చేశారు.

దళితులకు ఉండబడిన ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేసిందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై హింస పెరిగిందన్నారు.భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందన్నారు.

లౌకిక శక్తుల ఐక్యత దేశానికి తక్షణ అవసరంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దళితకిచ్చిన ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదన్నారు.

దళితబంధు మంత్రులు ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి వారి కార్యకర్తలకు ఫలహారంగా పంచుతున్నారని విమర్శించారు.

నియోజకవర్గానికి 100మందికి కాకుండా రాష్ట్రంలో18లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలన్నారు.దీనికి కనీసం 30 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

గ్రామగ్రామాన కేవీపీఎస్ దళిత యువతను సమీకరించి దశాలవారి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.దిల్లీ కేజ్రీ వాల్ ప్రభుత్వం మాదిరిగానే దళితులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు.

కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మూడెకరాల భూమి వాగ్దానం మున్నాళ్ల ముచ్చటగా మారిందన్నారు.

ఏ బడ్జెట్ లో నయాపైసా కేటాయించకపోకడం అన్యాయమని చెప్పారు.నల్గొండ జిల్లాలో కేవలం 276 కుటుంబాలకు మాత్రమే భూమి పంపిణీ చేశారని చెప్పారు.

ఎస్సి కార్పోరేషన్ రుణాల కోసం ఎటువంటి షరతులు లేకుండా నేరుగా అర్హులందరికీ ఇవ్వాలన్నారు.

స్థలం ఉన్నవారికి 3లక్షలతో ఇల్లు నిర్మాణం చేపడుతామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారని,ఏమాత్రం లేట్ కాకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్,జిల్లా ఉపాధ్యక్షులు దైదా శ్రీనివాస్,గాదే నర్సింహ,బొట్టు శివకుమార్,జిల్లా కమిటీ సభ్యులు దోంతాల నాగార్జున,బొల్లు రవీందర్,బొంగారాల వెంకులు, రమణయ్య, దండు రవీ,చిలుముల రామస్వామీ, మల్లయ్య,పరమేశ్,వంటేపాక క్రిష్ణ,చంద్రశేఖర్,అంజీ, వేములపల్లి వెంకన్న,బాలరాజు,బాబురావు తదితరులు పాల్గొన్నారు.

భారతీయులను గెలికిన చైనీస్ మహిళ.. ఏకపారేస్తున్న నెటిజన్లు..