”భారత సంతతి” మహిళకి అరుదైన గుర్తింపు

భారత సంతతికి చెందిన మహిళకి ఆస్ట్రేలియా లో అరుదైన గుర్తింపు లభించింది.ఈ ఘనత సాధించిన మొదటి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.

ఈ గుర్తింపుకు గాను అక్కడి ఎన్నారై లు ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘనత సాధించిన వీణా తన ప్రతిభని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు వివరాలలోకి వెళ్తే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆస్ర్టేలియా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సభ్యురాలిగా భారత సంతతి మహిళా శాస్త్రవేత్తగా వీణ సహజ్‌వాలా నియమింపబడ్డారు.

సాంకేతిక వ్యర్థాల పునర్వినియోగానికి సంబంధించిన విప్లవాత్మకమైన ఆవిష్కరణల్లో వీణ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.

మెటీరియల్స్‌ శాస్త్రవేత్త, ఇంజనీర్‌, ఆవిష్కర్త కూడా అయిన ఆమె ప్రస్తుతం సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌లోని స్ట్రాటజిక్‌ ఇండస్ట్రీ రిలేషన్స్‌ విభాగం అసోసియేట్‌ డీన్‌గా, సైన్స్‌ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు.

అయితే వీణా తన బీటెక్ ఐఐటీ కాన్పూర్‌ నుంచి పూర్తీ చేసి రీసెర్చ్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు గా ఎన్నికయ్యారు.

సస్టెయినబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ(ఎస్ ఎంఏఆర్‌టీ) సెంటర్‌ డైరెక్టర్‌ హోదాలో ఆమె అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సాంకేతిక వ్యర్థాల మైక్రోఫ్యాక్టరీని ప్రారంభించారు.అయితే ఇంతటి విప్లవాత్మాకమైన మార్పుని తీసుకు వచ్చిన మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డుల కెక్కారు.

మీ కారు ఎప్పుడూ రిపేరు అవుతోందా.. కారు లైఫ్ పెంచే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!