బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది.విశాఖకు ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, ఒడిశాకు దక్షిణ ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని సూచించింది.అదేవిధంగా విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో వాతావరణ శాఖ అధికారులు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అలాగే కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?