ప‌సుపు పాలు ఆరోగ్యానికే కాదు.. ఆ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌నూ వ‌దిలిస్తాయి!

ప్ర‌తి రోజు ఉద‌యం లేదా రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ ప‌సుపు పాలు తాగ‌మ‌ని చెబుతుంటారు పోష‌కాహార నిపుణులు.

ఎందుకంటే, ప‌సుపు పాలలో ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.అవి ఆరోగ్య పరంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ జ‌బ్బులు ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ప‌సుపు పాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వ‌దిలిస్తాయి.

మ‌రి ఇంత‌కీ ప‌సుపు పాల‌ను ఎలా చ‌ర్మానికి వాడాలి.? అస‌లు ప‌సుపు పాలు చ‌ర్మానికి అందించే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌సుపు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగిస్తే ప‌సుపు పాలు సిద్ధం అవుతాయి.

ఇలా త‌యారు చేసుకున్న ప‌సుపు పాలను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక‌.

అప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఐదారు టేబుల్ స్పూన్ల ప‌సుపు పాలు వేసుకోవాలి.

"""/"/ అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తాని మ‌ట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి వేసుకుని లూస్ స్ట్ర‌క్చ‌ర్‌లో మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజుల‌కు ఒక‌సారి ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుని చ‌ర్మంపై ఏర్ప‌డ్డ మొండి మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా తొల‌గిపోతాయి.

స్కిన్ టోన్ పెరుగుతుంది.నిర్జీవంగా ఉన్న చ‌ర్మం నిగారింపుగా మారుతుంది.

బ్లాక్ హెడ్స్‌, వైట్ హెడ్స్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.మ‌రియు ఓపెన్ పోర్స్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని కోరుకుంటున్నారా.. అయితే మీరీ రెమెడీని ట్రై చేయాల్సిందే!