ప్రజావాణిలో గ్రామ సమస్యల పై మండల తహశీల్దార్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై సోమవారం జరిగిన ప్రజావాణిలో మండల తహశీల్దార్ జయంత్ కుమార్( Jayant Kumar ) కు వినతి పత్రం అందజేశారు.

ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లో నివాసముంటున్న వారి కోసం ప్రతి నెల తాత్కాలికంగా ఒక రోజు అక్కడే బియ్యం ఇచ్చే విధంగా చూడాలని, గ్రామం లోకి వచ్చి బియ్యం తీసుకుపోవడానికి రేషన్ బియ్యం ధర కంటే ఆటో కిరాయి ఎక్కువ అవుతున్నాయని కిష్టంపల్లి కార్డు దారులు ఆవేదన వ్యక్తంచేశారనీ వారి ఇబ్బందులు దృష్ఠిలో పెట్టుకుని ఆక్కడే తాత్కాలిక రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని ఆమె వినతి పత్రంలో పేర్కొన్నారు.

అదే విధంగా ప్రతి నెల కరెంట్ బిల్లుల ( Current Bills )కోసం కిష్టంపల్లి వారికి ,డబల్ బెడ్ రూం ల వారికి ,విద్యుత్ వినియోగదారుల బిల్లుల చెల్లింపు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వగా సంబదింత శాఖ అధికారులతో చర్చించి ప్రజల సమస్యల్ని తీర్చడానికి తన వంతు సహకారం అందిస్తానని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ అన్నా.

మేము కూడా తన ఫ్యామిలీ అని బన్నీ ప్రూవ్ చేశారు.. సుకుమార్ భార్య కామెంట్స్ వైరల్!