పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహణ ముఖ్యం:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:ప్రజలకు సేవలు అందించడంలో సిబ్బంది నిర్వహణ,స్టేషన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

స్టేషన్ రైటర్స్,5ఎస్ అమలుపై ఈరోజు జిల్లా అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి సిబ్బంది, స్టేషన్ నిర్వహణ,రైటర్స్ విధులపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని అన్నారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషను నందు 5ఎస్ విధానం అమలు అవుతున్నదన్నారు.స్టేషన్ నిర్వహణలో ఈ విధానం చాలా ఫలితాలను ఇస్తుందని అన్నారు.

రైటర్స్ ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించాలని సూచించారు.స్టేషన్ లో ఎలాంటి పనులు పెండింగ్ ఉండకుండా చూడాలని తెలిపారు.

రికార్డ్స్ నిర్వహణను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలని చెప్పారు.వీడియో కాన్ఫరెన్స్ నందు ఐటీ కోర్ ఎస్ఐ శివ కుమార్,కానిస్టేబుల్ రవి ఎస్ఐలు,స్టేషన్ రైటర్స్ పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్28, శుక్రవారం 2024