పైసా వ‌సూల్‌ రివ్యూ

న‌టీన‌టులు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌ణ్‌, మ‌స్కాన్ సేథీ, కైరాద‌త్‌ మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌ సినిమాటోగ్ర‌ఫీ: జి.

ముఖేష్‌ ఎడిటింగ్‌: జునైద్ సిద్ధిఖి నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌ ద‌ర్శ‌క‌త్వం: పూరీ జ‌గ‌న్నాథ్‌ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ ర‌న్ టైం: 142 నిమిషాలు రిలీజ్ డేట్‌: 01 సెప్టెంబ‌ర్‌, 2017 బాల‌య్య - పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పైసా వ‌సూల్ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

బాల‌య్య చివ‌రి సినిమా శాత‌క‌ర్ణి సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డం, ఇటు పూరి నాలుగు వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో ఈ సినిమాను పూరి ఎలా తెర‌కెక్కిస్తాడా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది.

పూరి సినిమాలో డైలాగులు, హీరో క్యారక్టరైజేషన్ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంటుంది.

తేడా సింగ్ అంటూ టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది.ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా ? లేదా ? అన్న‌ది తెలుగుస్టాప్‌.

కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.h2స్టోరీ:/h2 కథగా చెప్పాలంటే పైసా వ‌సూల్ గొప్ప క‌థ కాదు.

పూరి మార్క్ మాఫియాడా, డ్ర‌గ్స్ లింకుల‌తో ఉన్న క‌థే.బాబ్‌మార్లే అనే ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్‌ను ప‌ట్టుకునేందుకు ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఓ ఖ‌ర‌త్నాక్ వ్య‌క్తి కోసం వెయిట్ చేస్తోన్న టైంలో ఏసీబీ కిర‌ణ్మ‌యి (కైరాద‌త్‌)ను బాల‌య్యను ప‌ట్టుకుని బాబ్‌మార్లేను చంపే మిష‌న్ అప్ప‌చెపుతుంది.

తేడా సింగ్ హారిక (మ‌స్కాన్‌)ను ఓ గ్యాంగ్ నుంచి కాపాడ‌తాడు.అయితే హారిక మాత్రం త‌న‌ను కాపాడేందుకు వ‌చ్చిన తేడాసింగ్‌ను కాల్చేస్తుంది.

ఇదిలా ఉంటే పోర్చుగ‌ల్‌లో ఉండే బాలు (బాల‌కృష్ణ‌) కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ అక్క‌డ ఓ గ్యాంగ్ ఎటాక్‌లో సారిక (శ్రియా)ను కాపాడ‌తాడు.

త‌ర్వాత ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఇండియాలో ఉండే తేడాసింగ్‌కు, పోర్చుగ‌ల్‌లో ఉండే బాలుకు లింక్ ఏంటి ? అస‌లు బాబ్ మార్లేను ఎవ‌రు ? బాబ్ మార్లేకు ఇండియాకు ఉన్న స‌బంధం ఏంటి ? బాబ్‌మార్లేను టార్గెట్ చేసిన బాలు ఏం కోల్పోయాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

!--nextpage H2న‌టీన‌టుల పెర్పామెన్స్‌:/h2 న‌టీన‌టుల్లో బాల‌య్య సినిమాలు హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా ఆయ‌న పెర్పామెన్స్ అదిరిపోతుంది.

న‌ట‌నా ప‌రంగా మాత్రం బాల‌య్య ఎప్పుడూ మైన‌స్ కాలేదు.పైసా వ‌సూల్‌లో కూడా బాల‌య్య స‌రికొత్త బాల‌య్య‌గా త‌న‌దైన న్యూ స్టైల్‌, యాక్ష‌న్ , మేన‌రిజ‌మ్స్‌, స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశాడు.

తేడాసింగ్‌గా బాలయ్య నటన అభిమానులతో ఈలలు వేయించింది.తేడాసింగ్ క్యారెక్ట‌ర్‌ను బాల‌య్య ఫ్యాన్సే కాకుండా ఇత‌ర సినీ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారు.

బాల‌య్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ఇలాంటి క్యారెక్ట‌ర్ చేశాడు.ఇక బాలుగా బాల‌య్య త‌న పాత్ర‌లో మెప్పించాడు.

హీరోయిన్ల‌లు శ్రియ , ముస్కాన్ , కైరా దత్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు.అండ‌ర్ క‌వ‌ర్ జ‌ర్న‌లిస్టుగా శ్రియ, ఏసీపీగా కైరా ద‌త్, ఫ‌స్టాఫ్‌లో మ‌స్కాన్ ఓకే.

వీరిలో సెకండాఫ్‌లో శ్రియ రోల్‌కు కాస్త ప్ర‌యారిటీ ఉంది.ఇక విల‌న్‌గా విక్రంజీత్‌, రా ఆఫీస‌ర్‌గా క‌బీర్ బేడీ, మంత్రి పాత్ర‌లో చేసిన రోల్స్ తేలిపోయాయి.

పృథ్వి, ఆలీ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.h2టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:/h2 సాంకేతికంగా చూస్తే ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీలో అన్ని క్లోజ‌ప్ షార్ట్‌లే ఉన్నాయి.

పెద్ద క‌ష్ట‌ప‌డిన‌ట్టు క‌న‌ప‌డ‌దు.ఆర్ట్ గురించి కొత్త‌గా చెప్పుకోలేం.

యాక్ష‌న్ పాత‌దే అయినా బాల‌య్య త‌న దైన స్టైల్లో కొత్త‌గా చూపించాడు.అనూప్ పాట‌లు, ఆర్ ఆర్ రెండూ పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి ట్యూన్స్‌తో త‌ల‌నొప్పి తెప్పించాయి.

జునైద్ ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో ఉన్నంత క్రిస్పీ సెకండాఫ్‌లో లేదు.భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాణ విలువ‌లు జ‌స్ట్ ఓకే.

ఇక పూరి డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల పూరి నుంచి వచ్చిన సినిమాలలో ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి.

ఈ వ‌రుస ప్లాపుల నేప‌థ్యంలో పూరి పైసా వ‌సూల్ విషయంలో గుణ‌పాఠం నేర్చుకుంటాడ‌ని అనుకుంటే పెద్ద‌గా మార‌లేదు.

పాత క‌థ‌, క‌థ‌నాలు, వీక్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్‌తో కేవ‌లం హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాను తీశాడు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ చూడ‌ని బాల‌య్య‌ను చూపించ‌డంలో మాత్రం పూరి స‌క్సెస్ అయ్యాడు.

ఈ సినిమా కొత్త‌గా ఏదైనా ఉంది అంటే అది బాల‌య్య న‌యా స్టైల్ మాత్ర‌మే.

అంత‌కు మించి ఏం ఆశించ‌లేం.h2ప్ల‌స్ పాయింట్స్ (+):/h2 - బాల‌య్య న‌యా స్టైల్ యాక్టింగ్ - పంచ్ డైలాగ్స్‌ - ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ - ఫ‌స్టాఫ్‌ H2మైన‌స్ పాయింట్స్ (-):/h2 - రొటీన్ స్టోరీ - మ్యూజిక్‌ - పేల‌వ‌మైన డైరెక్ష‌న్‌ - సెకండాఫ్‌ ఫైన‌ల్ పంచ్‌: హాఫ్ ' పైసా వ‌సూల్‌ ' H2' పైసా వ‌సూల్ ' తెలుగుస్టాప్‌.

కామ్ రేటింగ్‌: 2.75 / 5/h2.

మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!