పెళ్ళైన 8 రోజులకే ఇంట్లో విషాదం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం
శోభనాద్రిగూడెం గ్రామంలో
విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన వారం
రోజులకే నవ వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడంతో గ్రామంలో
విషాద ఛాయలు అలుముకున్నాయి.
శోభనాద్రిగూడెంకు చెందిన పరికల శ్రీకాంత్ (23)అనే యువకుడికి తన సొంత మేనమామ కూతురితో ఫిబ్రవరి 20 న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
ఏమైనదో ఏమో కానీ,శ్రీకాంత్ సోమవారం ఇంటి నుండి బైక్ పై బయటకు వెళ్లి,తిరిగి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలీ తుదిశ్వాస విడిచాడు.
కండ్ల ముందే కన్న కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు,ఇంకా కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త తనువు చాలించడంతో నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయి బోరున విలపిస్తున్నారు.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..