పెరుగు, వాము క‌లిపి తీసుకుంటే ఆ జ‌బ్బులు దూరం?

పెరుగు.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పెరుగు లేనిదే రోజు గ‌డ‌వ‌దు అనే వారు ఎంద‌రో.రోజు వారి భోజ‌నంలో రోటీ, రైస్‌, ప‌ప్పు, పులుసు, ప‌చ్చ‌డి, కూర‌, స్వీట్లు ఇలా ఎన్ని తిన్నా.

చివ‌ర్లో పెరుగు తీసుకోకుంటే మాత్రం ఏదో వెలితిగానే ఉంటుంది.అందుకే పెరుగు లేనిదే భోజ‌నం సంపూర్ణం కాద‌ని అంటారు.

ఇక పెరుగు అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు.బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందువల్లే, రోజుకు క‌నీసం ఒక క‌ప్పు పెరుగైనా తీసుకోవాలి.అయితే పెరుగును డైరెక్ట్‌గానే కాకుండా.

అందులో కొద్దిగా వాము క‌లిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డే వారు ఒక క‌ప్పు పెరుగులో అర స్పూన్ వాము క‌లిపి తీసుకుంటే.

ర‌క్త పోటు త్వ‌ర‌గా కంట్రోల్ అవుతుంది.అలాగే క‌డుపు నొప్పిని త‌గ్గించ‌డంలోనూ ఈ కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

"""/" / కాబ‌ట్టి, క‌డుపు నొప్పి ఇబ్బంది పెట్టిన‌ప్పుడు ట‌క్కున ట్యాబ్లెట్ వేసుకోవ‌డం మానేసి.

పెరుగులో కొద్దిగా వాము లేదా వాము పొడి క‌లిపి తీసుకుంటే.మంచి ఫ‌లితం ఉంటుంది.

పెరుగు, వాము క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల‌.చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి, దంతాలు పుచ్చిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

అలాగే చాలా మంది మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వికారం, వాంతులతో నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

అయితే రెండు లేదా మూడు స్పూన్ల పెరుగులో కొద్దిగా వాము క‌లిపి తీసుకుంటే వికారం, వాంతి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

త‌ర‌చూ త‌ల‌నొప్పితో బాధ ప‌డే వారు పెరుగు, వాము క‌లిపి తీసుకుంటే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందుతారు.

ఇక పెరుగులో వాము క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

‌‌‌.

కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు రిజర్వ్..!