పురుషులలో పొద్దున్నే అంగం స్తంభిస్తుంది, మరి స్త్రీలలో ఏం జరుగుతుంది?

పొద్దున్న లేవగానే పురుషులు కలవరపడిపోతారు.ఎందుకంటే చాలాసార్లు నిద్ర లేచేసరికి వారి అంగం స్తంభించి ఉంటుంది.

ఒక్కోసారి స్కలనం కూడా జరిగి ఉంటుంది.ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో కూడా గుర్తుకు ఉండదు.

దీన్నే మార్నింగ్ గ్లోరి అని అంటారు.ఇది ఒక సహజమైన ప్రక్రియ.

ఎలాంటి భయం అవసరం లేదు.శృంగార కలలు రావడం వలన కావచ్చు, లేదంటే నిద్రలోకి జారుకున్న తరువాత ఒక హార్మోన్ చూపే ప్రభావం వలనే కావచ్చు, ఈ రెండు కాకుండా చెప్పాలంటే మూత్రాన్ని ఆపేందుకు కూడా పురుషాంగం పొద్దున్నే స్తంభించి ఉంటుంది.

పురుషులలో మార్నింగ్ గ్లోరి అనేది సర్వసాధారణమైన విషయం.ఇలా జరిగితే పురుషాంగం ఆరోగ్యంగా ఉన్నట్లు.

వారానికి ఒకసారి అయినా ఇలా చాలామందికి జరుగుతుంది.మరి స్త్రీల సంగతి ఏమిటి? మార్నింగ్ గ్లోరి లాంటిది ఏమైనా వారిలో ఉందా? స్త్రీలు కూడా నిద్రలో భావప్రాప్తి పొందగలరు.

స్త్రీలు కూడా తడిసిన యోనితో నిద్ర లేస్తారు.అయితే మరీ పురుషులకి జరిగేంత తరచుగా వారికి జరగదు.

దీన్నే వె ట్ డ్రీమ్స్ అని అంటారు.స్త్రీలలో శృంగార కలల వలన ఇలా జరుగుతుంది.

37% స్త్రీలు ఇలా వెట్ డ్రీమ్స్ వలన భావప్రాప్తి పొందుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇలా నిద్రలో వచ్చే భావప్రాప్తిని నొక్టార్నల్ ఆర్గాజం అని అంటారు.!--nextpage ఎప్పుడైతే స్త్రీ నిద్రలో తనకు తెలియకుండానే కామోద్రేకం కలిగించే కలలను చూస్తుందో, రక్తం యోని భాగాలవైపు ఎక్కువగా సరఫరా అవుతుంది.

ఒక్కోసారి శృంగారభరిత కలలు రాకపోయినా ఇలా జరగోచ్చు.అంటే ఆలోచనలు లేకపోయినా, పెల్విస్ దగ్గర రక్తం బాగా సరఫరా అవడంతో, యోని శృంగారానికి స్పందించినట్టే స్పందిస్తుంది.

అందుకే భావప్రాప్తి కలిగి పొద్దున్నే తడిని చూస్తారు అమ్మాయిలు.పురుషులలో మార్నింగ్ గ్లోరి లాగే ఇది కూడా సహజమైన శరీర చర్య.

దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు.హైజీన్ ఇబ్బందులు కలగొచ్చు కాని సహజంగా జరిగే చర్యలను మనం ఆపలేముగా.

పురుషులకి కూడా మార్నింగ్ గ్లోరి వలన హైజీన్ ఇబ్బందులు ఉంటాయి.కాని మార్నింగ్ గ్లోరి, వెట్ డ్రీం ఆర్గాజంలో అన్ని పాజిటివ్ పాయింట్లే ఉన్నాయి.

ఇలా తరచుగా జరిగినా ఎలాంటి భయం అవసరం లేదు.శృంగార కోరికలు ఎక్కువ ఉండటంలో ఎలాంటి తప్పు లేదు.

పెళ్లి అయిన తరువాత, భాగస్వామితో రెగ్యలర్ గా శృంగారం చేసే అలవాటు ఉన్నా కూడా ఇలా జరగోచ్చు, అందులో తప్పేమీ లేదు.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?