పుచ్చకాయల పంటను ఆశించే పచ్చ మచ్చల వైరస్ ను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

పుచ్చకాయల పంట( Watermelon Farming )ను ఆశించే పచ్చ మచ్చల వైరస్ చాలా కాలం పాటు మట్టిలో ఉండే మొక్కల అవశేషాలలో జీవించి ఉంటుంది.

ఈ వైరస్ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, మొక్కలకు గాయాలు కావడం లాంటి వాటి వల్ల వ్యాపిస్తుంది.

అంటు కట్టడం వల్ల ఇతర మొక్కలకు ఈ వైరస్ చాలా సులభంగా సోకుతుంది.

ఒకసారి మొక్కకు ఈ వైరస్ సోకిందంటే నివారించడం చాలా కష్టం.గ్రీన్ హౌసెస్ లో పండించే పంటకు ఈ వైరస్ల నుండి సంక్రమణల సంఖ్య పెరుగుతుంది.

పుచ్చకాయ మొక్క లేత ఆకులపై లేత పసుపు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడడం, ఆకులు పాలిపోవడం జరిగితే ఆ మొక్కకు ఈ వైరస్ సోకినట్టే.

ఇక క్రమంగా ఆకులు రాలిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు నిర్జీవంగా మారడం జరుగుతుంది.

"""/"/ ఈ వైరస్ వల్ల పుచ్చకాయ పండ్లపై( Watermelon Cultivattion ) అధిక మొత్తంలో మచ్చలు, చారలు ఏర్పడతాయి.

దీంతో పండ్లు ముందుగానే రాలిపోతాయి.కంపెనీ సర్టిఫైడ్ తెగులు నిరోధక విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.

పొలంలో పనిచేస్తున్నప్పుడు పరిశుభ్రం చేసిన పనిముట్లను ఉపయోగించాలి.ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.

ఈ వైరస్ సోకిన మొక్కలను వెంటనే తొలగించి కాల్చివేయాలి. """/"/ సేంద్రియ పద్ధతి( Organic Farming )లో పుచ్చకాయ విత్తనాలను 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పొడి వేడి చేస్తే అవి చురుకైన వైరస్ కణాల నుండి విముక్తి పొందుతాయి.

ఏ కీటకాలను లక్ష్యంగా చేసుకొని సేంద్రీయ క్రిమిసంహారకాలను వాడాలి.రసాయన పద్ధతిలో ఈ వైరస్ ను నివారించే పద్ధతులు అందుబాటులో లేవు.

కాబట్టి ఈ వైరస్ రాకుండా ముందుగానే సంరక్షక చర్యలు తీసుకోవాలి.ఈ తెగులు సోకే అవకాశం ఉన్న మొక్కలు ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకప్పటి ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు టాప్ డైరెక్టర్లు మారాలంటే ఆ ఒక్కటి చేయాల్సిందే..?