యాదాద్రి జిల్లా:తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో సీనియర్ నేత,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు పార్టీ మార్పుపై స్పందించారు.
మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడాతూ తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలతో సంబంధం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
తాను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.
తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతానని ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు.