నేటి నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి జిల్లా:శ్రీలక్ష్శీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది.నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు.

శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో ఉత్సవాలు ప్రారంభమై 14న శతఘటాభిషేకంతో పరిసమాప్తి కానున్నాయి.10న ఎదుర్కోలు,11న తిరుకల్యాణ మహోత్సవం,12న దివ్యవిమాన రథోత్సవం,13న మహా పూర్ణాహుతి,చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

యాదాద్రీశుడి క్షేత్రంలో ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది.

ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు.

పూర్వం స్వామివారి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని చెబుతుంటారు.బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అని ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది.

ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది.

విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి.

మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు.మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరాలు జరుపుతారు.

ఏడు,ఎనిమిది,తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు,తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు.పదోరోజున చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!