“నాటా” సాహిత్య పోటీలకి “ఎన్నారై” లకి ఆహ్వానం
TeluguStop.com
ఉత్తర అమెరికా తెలుగు సమితి (“నాటా”) ప్రతీ ఏటా తెలుగు సంస్కృతీ ,సాంప్రదాయాలు మరియు కవితలు ఇలా ఎదో ఒక విధంగా తెలుగుదనాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని ఎదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.
అయితే అందులో భాగంగానే ఈ సారి నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఆహ్వానం పలికింది.
అయితే నాటా ఈ సారి సారంగా వెబ్ అనే సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే వీటిలో గెలుపొందిన విజేతలని జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు.
ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ.15 వేలు, రెండో బహుమతికి రూ.
10 వేలు, మూడో బహుమతికి రూ.5 వేలు ఇవ్వనున్నారు.
అయితే గతంలో కూడా ఎటువంటి పోటీలకి తెలుగు వారి నుంచీ విశేష స్పందన లభించింది.
అయితే “కవితల” పోటీల్లో మొదటి బహుమతికి రూ.5 వేలు, రెండో బహుమతికి రూ.
3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు.జూన్ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది.
పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks!--com)లో ప్రచురిస్తారు.
అదేవిధంగా రచనలు Literaty@nata2018!--org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?