నంద్యాల జోష్‌తో బాబు షాకింగ్ డెసిషన్
TeluguStop.com

మేధావుల అంచనాలకు సైతం అందని విధంగా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.


ఇక, పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.నిజానికి ఈ ఉప పోరుపై అనేక ఉత్కంఠలు నెలకొన్నాయి.


తమను ప్రజలు ఆశీర్వదిస్తారో లేదోనని చంద్రబాబు అనేక సందర్భాల్లో మధనపడ్డారు.దీనికి కూడా పలు కారణాలు ఉన్నాయి.
ప్రత్యేక హోదా డిమాండ్, పార్టీ ఫిరాయింపులు, అప్పటి వరకు నంద్యాల వైపు ముఖం కూడా తిప్పని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితిలో మామూలుగా నైనా గెలిస్తే.చాలు అనుకున్నారు బాబు.
కానీ, ఊహించని విధంగా బాబు అభివృద్ధి మంత్రం పనిచేసే సరికి వైసీపీ అడ్రస్ దాదాపు గల్లంతయ్యిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ క్రమంలో మంచి ఊపుమీదున్న చంద్రబాబు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారనే వార్తలు అమరావతిలో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల విజయం తీవ్ర ప్రభావం చూపుతోందని, అభివృద్ధి మంత్రం గట్టిగా పనిచేస్తోందని బాబు విశ్వసిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ముందస్తుకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్టు సమాచారం.!--nextpage
ఇక, అదేసమయంలో జగన్ పదే పదే అంటున్న తన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించినట్టూ ఉంటుందని బాబు అనుకుంటున్నట్టు తెలిసింది.
ఇక, ప్రధానంగా ప్రస్తుతం జగన్ తన గొయ్యి తనే తీసుకున్నాడని, తన నోటితో తనే నష్టపోయాడని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ ప్రభ తగ్గిపోయిందని ఈ సమయంలోనే టీడీపీ విజృంభిస్తే.
జగన్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బాబు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం.
అదేసమయంలో ఇప్పటికిప్పుడు అంటే.ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, నిన్నటికి నిన్న అమరావతికి వచ్చిన మంత్రి భూమా అఖిల, ఆమె సోదరుడు నంద్యాల తాజా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిలు సీఎంని కలిసిన అనంతరం మీడియాతో మాట్టాడుతూ.
జగన్ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో బాబు రాజీనామా చేయిస్తే.
గెలిపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అంటే.
రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి ఏంజ రుగుతుందో చూడాలి.