నంద్యాల‌లో పోలింగ్ పెరిగితే ఎవ‌రికి ప్ల‌స్‌… ఎవ‌రికి మైన‌స్‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక తెలుగు రాజ‌కీయాల్లోనే కీల‌కంగా మారింది.

బుధవారం ఉదయం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభ‌మైంది.తొలి రెండు గంటల్లోనే భారీ ఎత్తున పోలింగ్ జ‌రిగింది.

నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.09 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు.

ఓవ‌రాల్‌గా 85 శాతం ఓటింగ్ న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగితే మాత్రం అది వైసీపీకి అత్యంత అనుకూల సంకేతంగా ఉంటుందని.

ఎప్పటిలాగే ఉంటే మాత్రం అది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

పోలింగ్ శాతం పెరిగితే సర్కారుపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను చాటేందుకు ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్లు అవుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి.

అయితే ఓటింగ్ పెరిగితే భూమా సానుభూతి బాగా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని, అది త‌మ‌కే క‌లిసి వ‌స్తుంద‌ని టీడీపీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి.

!--nextpage ఈ ఉప ఎన్నిక‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.ఇటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహా.

ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు.ఇక టీడీపీ హీన‌ప‌క్షం 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామ‌ని లెక్క‌లు వేసుకుంటోంది.

ఇక వైసీపీ క‌నీసం 6 వేల‌కు త‌గ్గ‌కుండా 10 వేల వ‌ర‌కు గెలుస్తామ‌ని గెలుపుపై ధీమాతో ఉంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి 3600 ఓట్ల తేడాతో గెల‌వ‌గా, ఎంపీ అభ్య‌ర్థి ఎస్పీవై.

రెడ్డికి మాత్రం 16 వేల మెజార్టీ వ‌చ్చింది.మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌రు తీర్పు ఎటు వైపు ఉంటుందో ? తెలియాలంటే ఈ నెల 28 వ‌ర‌కు ఆగాల్సిందే.

టీడీపీ మేనిఫెస్టో పై జగన్ కీలక వ్యాఖ్యలు..!!