దాతృత్వాన్ని చాటుకున్న పోలీసు అధికారులు

నల్లగొండ జిల్లా:ఆపదలో ఉన్నప్పుడు మేమున్నానంటూ ఆదుకొని,అక్కున చేర్చుకొనే రక్త సంబంధీకులు కరువైన నేటి సమాజంలో,స్నేహం మాత్రం అక్కడక్కడా తన ధర్మాన్ని పదిలం చేసుకుంటుంది.

నల్లగొండ జిల్లా,మిర్యాలగూడలో ఆ స్నేహబంధపు పరిమళాలు వెదజల్లాయి.వివరాల్లోకి వెళితే.

ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ గౌడ్ మరణించిన విషయం తెలిసిందే.

2009 సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ కు చెందిన రాఘవేందర్ మరణం అతని కుటుంబ సభ్యులతో పాటుగా,ఒకే శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన నేస్తాలకూ తీవ్ర ఆవేదన కలిగించింది.

ఇటువంటి విషాద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని తలచిన బ్యాచ్ మేట్స్,తామంతా కలిసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు జమ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 1103 మంది రాఘవేందర్ స్నేహితులు అనుకున్నదే తడవుగా ఈ డబ్బును జమ చేస్తూ,తమకు దూరమైన స్నేహితుడి పిల్లల భవిష్యత్తు కొరకు ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

సోమవారం జరిగిన ఏకాదశ దిన కర్మ రోజున ఈ డబ్బును రాఘవేందర్ కుటుంబానికి అందయజేసీ ఆ కుటుంబానికి మేమున్నామనే భరోసా ఇచ్చారు.

గతంలోను ఏలూరు రేంజ్ లో చనిపోయిన ఇద్దరు ఆఫీసర్స్ కి రూ.55 లక్షలు వరకు, హైదరాబాద్ రేంజ్ లో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ గా పని చేసి గత సంవత్సరం అబ్దుల్లాపుర్ మెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లక్ష్మణ్ పిల్లలకు 45 లక్షలు,రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్న 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్స్ ఇచ్చి తమ స్నేహ బంధాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో 2009 బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: స్వంత ఊరిలో బైకుపై షికార్లు కొడుతున్న ధోనీ..