తెల్ల జుట్టు రావడం మొదలైందా? అయితే వెంటనే ఇలా చేయండి!
TeluguStop.com
వయసు పెరిగే కొద్ది నల్ల జుట్టు తెల్లగా మారడం సర్వ సాధారణం.కానీ, ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, థైరాయిడ్, విటమిన్ బి 12 లోపం, ధూమపానం, మద్యపానం, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్ ను వినియోగించడం, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటివి అకాల తెల్ల జుట్టుకు కారణమవుతుంటాయి.
ఏదేమైనా తక్కువ వయసులోనే తెల్ల జుట్టు వచ్చిందంటే ఇక వారి బాధ వర్ణణాతీతం.
తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు వీరు పాడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
మరి మీకు తెల్ల జుట్టు రావడం మొదలైందా.? అయితే అస్సలు టెన్షన్ పడకుండా ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడండి.
తద్వారా జుట్టు తెల్ల బడటం ఆగిపోతుంది.మరియు అప్పటికే తెల్లబడిన జుట్టు సైతం నల్లగా మారుతుంది.
మరి లేటెందుకు ఆ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ. """/" /
ముందుగా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పూర్తిగా పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
అలాగే ఒక స్పూన్ మిరియాలను మెత్తగా దంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనెను పోయాలి.
నూనె కాస్త హీట్ అవ్వగానే అందులో పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, దంచి పెట్టుకున్న మిరియాలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన నూనెను చల్లారబెట్టుకుని.అప్పుడు స్ట్రైనర్ సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఒక బాటిల్‌లో ఈ ఆయిల్‌ను స్టోర్ చేసుకుంటే దాదాపు పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది.
రోజుకు ఒకసారి ఈ నూనెను తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి.ఆపై కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే తెల్ల జుట్టును సులభంగా అడ్డుకోవచ్చు.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం తగ్గుతుంది.
ఇక ఈ ఆయిల్ వాడేటప్పుడు తప్పకుండా మూడు రోజులకు ఒకసారి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
జుట్టు రాలడాన్ని అరికట్టే పవర్ ఫుల్ టానిక్ ను ఇంట్లోనే తయారు చేసుకోండిలా..!