“తెలుగు ఎన్నారై ” పై ఇంటర్ పోల్ నోటీసు జారీ..

ఎంతో మంది ఎన్నారైలు విదేశాలలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు.లేదా తమ ప్రతిభ ద్వారా ఎంతో ఉన్నతమైన శిఖరాలని అధిరోహిస్తూ ఉంటారు.

ఆ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతూ ఉంటారు అయితే మరి కొంతమంది ఎన్నారైలు మాత్రం భారత దేశం పరువుని విదేశాల సాక్షిగా తీసేస్తూ ఉంటారు.

భారతీయులపై మంచి అభిప్రాయం ఏర్పడిన తరుణంలోనే మరో పక్క ఇంకొక కొంతమంది ఎన్నారైలు చేస్తున్న భాగోతాల వలన పరువు పోతోంది సరికదా భారతీయులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

వివరాలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ !--nextpage దుబాయ్ లో తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కోట్లకుపైగా టొకరా పెట్టి అక్కడి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు అయితే సదరు వ్యక్తీ తెలంగాణా వాసి కూడా కావడంతో అక్కడ కూడా వ్యాపార లావాదేవీలు చేయడం కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద కోట్లు కొల్లగొట్టి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు.

అయితే లోకల్ గా ఉన్న భాదితులు నిందితుడు విశ్వప్రసాద్‌రెడ్డిపై డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

విచారణకు రాచకొండ కమిషనర్‌ను ఆదేశించారు.అయితే నిందితుడు దుబాయ్ లో కూడా ఇదే తరహా నేరాలకి పాల్పడి అక్కడ భారీ ఆర్ధిక నేరానికి పాల్పడటంతో ఇంటర్‌పోల్, రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేశారు.

అయితే నిందితుడి పాస్‌పోర్టులో నిజామాబాద్ చిరునామా ఉండడంతో అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి నోటీసులు అందాయి.

చిరునామా ఆధారంగా నిజామాబాద్‌లో గాలించినా నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో సీబీఐ ఇంటర్‌పోల్(న్యూఢిల్లీ) 2016 ఏప్రిల్ 25న రాత పూర్వకంగా తెలిపింది .

అయితే నిందితుడు కోసం గాలిస్తున్నామని సమాచారం అందిన వెంటనే మాకు తెలుపాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది ఇంటర్ పోల్.

ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?