డ్రైవర్ కి గుండెపోటుతో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు దుర్మరణం

యాదాద్రి జిల్లా:జిల్లాలోని సంస్థాన్​ నారాయణపురం మండలం శేరిగూడెంలో విషాదం చోటుచేసుకుంది.ఇటుకలను సరఫరా చేసే ట్రాక్టర్ దిగుమతి చేసి వస్తుండగా ట్రాక్టర్​ డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్​తో పాటు ఇంజిన్​పై కూర్చున్న మరో ఇద్దరు కూలీలు మృతి చెందగా,మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం చౌటుప్పల్​ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఏకంగా 5 రోజుల పాటు ఎవరికి మొహం చూపించుకోలేక ఇంట్లోనే ఉన్న శోభన్ బాబు..!