టీబీ వ్యాధి అంతం..మన పంతం-: వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి

ప్రపంచక్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా వైద్య,ఆరోగ్య కార్యాలయం వరకు క్షయ నిర్మూలనపై అవగాహన ర్వాలి నిర్వహించారు.

ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ మాలతి జెండా వూపి ప్రారంభించారు .

అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి మాట్లాడుతూ 2025 నాటికి టీ బి అంతం మన పంతం అనే నినాదంతో పనిచేయాలని అలాగే దేశంలో జిల్లాకు కాంస్య పతకం రావటానికి కృషిచేసిన వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.

జిల్లాలో ఆశ కార్యకర్త నుండి వైద్యాధికారులు వరకు క్షయ నిర్మూలన కోసంచేసిన సేవలను కొనియాడారు .

ఇదే ఉత్సాహంతో పని చేసి వచ్చే సంవత్సరంనాటికి జిల్లాకు బంగారు పతకాన్ని సంపాదించేందుకు తగిన కృషి చేయాలని అన్నారు .

ముఖ్యంగా క్షయవ్యాధి ఎలా వస్తుంది .వచ్చిన తరువాత ఏఏ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి .

ఎక్కడ చికిత్సలు పొందాలి , ఎంతకాలం మందులు వాడాలి అనే వాటిపై ప్రజలలో అవగాహన కల్పించాలని , అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో జరిగే పరీక్షల శ్యాంపిల్స్ ను తెలంగాణ డయాగ్నోస్టిక సెంటర్ కు ఎప్పటికప్పుడు పంపించాలని కోరారు .

అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధికి సంబందించిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వాటిని ఉపయోగించుకోని సరియైన సమయంలో చికిత్సలు తీసుకోవాలని , ముఖ్యంగా డోసుల ప్రకారం ఎన్ని రోజులు వాడాలో తప్పనిసరిగ్గా అన్ని రోజులు వాడితే క్షయ వ్యాధి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు .

ముఖ్యంగా ఎర్లీ ఓటెక్షన్ , ఎర్ల్ ట్రీట్ మెంట్ ' తో క్షయ వ్యాధి పూర్తిగా నయం అవుతుంద అని ఆమె తెలిపారు .

జల్లాలోగల వైద్య ఆరోగ్య సిబ్బంది అన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలపట్ల నిబద్ధతతో పని చేసి వైద్య ఆరోగ్య రంగంలో జిల్లాకు మంచిపేరు తీరాలని తెలిపారు .

తదనంతరం జిల్లా టీ.బి విభాగంలో వైద్యాధికారి చౌహన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశామసారం , జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ఆధికారి సహకారంతో జిల్లాలో క్షయ నిర్మూలన కోసం బాద్యతతో కృషిచేస్తామని జిల్లాకు బంగారు పతకం వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు.

క్షయవిభాగంలో పనిచేసిన సూపర్వైజర్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు, స్టాఫ్ నర్సులకు ఫార్మసిస్టులకు ప్రశంసా పత్రాలు అందజేశారూ.

జిల్లా వైద్యఆరోగ శాఖ సిబ్బందితో ర్యాలీగా వచ్చిన నర్సింగ్ విద్యార్థినలచే క్షయ వ్యాధి నిర్ములనకై ' టిబి అంతం మనసంతం అనే నినాదంపై ప్రతిజ్ఞ చేయించారు .

మీడియాకు క్షమాపణలు చెప్పిన సూర్య.. ఎందుకంటే?