జలుబు దగ్గుతో ఇబ్బందిగా ఉందా ? ఐతే మీ ఇంట్లో పసుపు,తులసి ఉన్నాయా?

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి.జలుబు వచ్చిందంటే ఒంటి నొప్పులు,గొంతు నొప్పి వంటివి కూడా వచ్చేసి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.

పెద్దవాళ్ళు ఎదో ఒక రకంగా తట్టుకుంటారు.కానీ పిల్లలు అయితే తట్టుకోవటం చాలా కష్టం.

అందువల్ల వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.వాము పొడి దగ్గు వచ్చినప్పుడు సమయంలో కన్నా రాత్రి సమయంలో ఎక్కువగా వేధిస్తుంది.

దాంతో నిద్ర కూడా సరిగా పట్టదు.రాత్రి పడుకొనే ముందు చిటికెడు వామును బుగ్గలో పెట్టుకొని నిదానంగా నములుతూ రసాన్ని మింగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

తులసి దగ్గును తగ్గించటంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఉదయం నాలుగు తులసి ఆకులను నమిలితే సరిపోతుంది.

తులసిలో కఫాన్ని తగ్గించే లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.దాల్చినచెక్క దాల్చినచెక్కలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారించే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జలుబు నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి రోజులో 2 నుండి 3 సార్లు తీసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అల్లం అల్లంలో యాంటీవైరల్‌, ఫంగల్‌ లక్షణాలు అధికంగా ఉండుట వలన జలుబును చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

అల్లం ముక్కలను నమలవచ్చు.లేదా అల్లం టి త్రాగవచ్చు.

తేనే అల్లం రసం లేదా నిమ్మరసంలో తేనే కలిపి తీసుకోవాలి.తేనే,నిమ్మరసంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.

అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.మిరియాలు ఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి త్రాగాలి.

ఉదయం సమయంలో తీసుకుంటే ఆ ప్రభావం సాయంత్రం వరకు ఉంటుంది.ఇలా రెండు మూడు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.

"""/"/ పసుపు యాంటీ సెప్టిక్‌ లక్షణాలు ఉన్న పసుపు ఎన్నో వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది.

దగ్గు,జలుబు ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని త్రాగితే మంచి ప్రభావాన్ని చూపి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే , నిమ్మరసం కలిపి త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోతాయి.

వేడి నీటి ఆవిరి వేడి నీటి ఆవిరి పట్టినా మంచి ఉపశమనం కలుగుతుంది.10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి.

ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది.శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!