జగన్ పవన్ దూకుడుతో బాబు లో కలవరం

ఒకవైపు ప్రజాసంకల్పయాత్ర పేరుతో జగన్ ప్రజల్లో తిరుగుతూ.ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టాకుండా తిడుతూ ప్రజల్లో మంచి హుషారు తీసుకొస్తున్నాడు.

మరో వైపు శ్రీకాకుళం జిల్లా నుంచి జన చైతన్య యాత్ర పేరుతో పవన్ కూడా హల్చల్ చేస్తున్నాడు.

స్థానిక సమస్యల మీద ప్రభుత్వం మీద మీద కట్టి పెట్టి మరీ నిలదీస్తున్నాడు.

ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు లో గుబులు పుట్టిస్తున్నాయి.అసలే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసిన నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన బాబు ఈ ఇరువురి నేతల ప్రభావం జనాల్లో ఈమేరకు ఉందొ తెలుసుకునేపనిలో పడ్డాడు.

అందుకే రాష్ట్ర నిఘా విభాగం అధికారులను రంగంలోకి దింపి జగన్- పవన్ యాత్రల ప్రభావం పై సర్వే చేయిస్తున్నాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ స‌ర్వే అత్యంత ర‌హ‌స్యంగా నిర్వ‌హించాల‌ని బాబు భావించారు.

అయితే అది సాధ్యమయ్యే పని కాదు కదా.అనేక రూపాల్లో ఈ స‌మాచారం బ‌య‌ట ప‌డింద‌ని తెలుస్తోంది.

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ప్ర‌భావం, ప‌వ‌న్ ప్ర‌సంగాల వేడి… ఇవి ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తున్నాయ‌నే అంశమై ఈ స‌ర్వే ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ట‌.

స‌ర్వే అంటే ఏవో కొన్ని శాంపిల్స్ తీసుకుని అంచ‌నాకి వ‌చ్చేయ‌డం కాకుండా… వాస్త‌వ ప‌రిస్థితిని వీలైనంత స్ప‌ష్టంగా తెలుసుకునేందుకు బూత్ స్థాయి నుంచీ వివ‌రాలు సేక‌ర‌ణ ఉంటోంద‌ని వినిపిస్తోంది.

దీంతోపాటు, తెలుగుదేశం ప‌నితీరుపై కూడా స‌మ‌గ్ర వివ‌రాల సేక‌ర‌ణ జ‌రుగుతోంది.స్థానిక నేత‌ల నుంచి మొద‌లుకొని ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ ప‌నితీరుపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో కూడా ఈ స‌ర్వే ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

!--nextpage సర్వేలు చేయించడం బాబు కి కొత్తేమి కాదు.అయన నిరంతరం ఏదో ఒక సర్వే చేయిస్తూనే ఉంటాడు.

అందుకే సొంత పార్టీ నాయకుల పనితీరు మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ లు తెప్పించుకుని దానికి అనుగుణంగా వారికి ట్రీట్మెంట్స్ ఇస్తుంటాడు.

కానీ ప్రస్తుతం చేయిస్తున్న స‌ర్వేలో ప‌వ‌న్‌, జ‌గ‌న్ ల గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవ‌డంపై ప్రధానంగా దృష్టిపెట్టాడు.

ఈ స‌ర్వే ఫ‌లితాల ఆధారంగా తెలుగుదేశం ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న రచించే పనిలో బాబు ఉన్నాడు.

జగన్ పవన్ యాత్రలను పెద్దగా పట్టించుకోనట్టు బాబు పైకి కనిపిస్తున్నా.లోలోపల మాత్రం కలత చెందుతున్నట్టు టీడీపీ ముఖ్యనాయకులు కొందరు మీడియా కు లీకులు ఇస్తున్నారు.

డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?