నల్లగొండ జిల్లా:
తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 125 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు కొండేటి మురళీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి,దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ధైర్య సాహసాలు,ముందు చూపే
నేటి సమాజంలోని మహిళలకు మార్గం చూపాయని తెలిపారు.
మహిళలు తీవ్ర వివక్షతకు గురవుతున్న సమయంలో మహిళలకు చదువు కావాలని భావించిన
మహనీయుడు జ్యోతిరావు పూలే అని,ఆయన త్యాగ ఫలితమే ఆయన తన సతీమణి సావిత్రిబాయి పూలే
అని అన్నారు.
జ్యోతిరావుపూలే విద్యనేర్పించి ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మనకు అందించారన్నారు.అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టి ఎస్ యు జిల్లా నాయకులు కత్తుల చందన్,పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, విజయ్,రాజు,సతీష్,విక్రమ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?