గర్భవతులు మొలకలు తింటే చాలా డేంజర్..ఎందుకంటే?
TeluguStop.com
అమ్మ అనే పిలుపు ఎంత మధురంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే పెళ్లైన ప్రతి మహిళా గర్భం పొందాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎంతగానో ఆరాటపడుతుంది.
ఇక కోరుకున్నట్టుగానే గర్భం దాల్చితే ఆ మహిళ పడే ఆనందం అంతా ఇంతా కాదు.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో తినే ఆహారం, వేసుకునే బట్టలు, చేసే పనులు ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.మరియు సమయానికి కూడా తీసుకోవాలి.
అలాగే గర్భవతులు కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాంటి వాటిలో ముడి మొలకలు (మొలకెత్తిన గింజలు) ఒకటి.
వాస్తవానికి మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందుకే చాలా మంది మొలకలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటారు.
మొలకల్లో క్యాల్షియం, ఐరన్, జింక్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు మొలకల ద్వారా పొందొచ్చు.
"""/" /
ఇన్ని పోషఖాలు ఉన్నప్పటికీ ముడి మొలకలను ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవద్దనే నిపుణులు చెబుతారు.
ఎందుకూ అంటే మొలకెత్తిన గింజల్లో ఎన్నో పోషకాలతో పాటు సాల్మొనెల్లా, లిస్టెరియా మరియు ఇ-కోలి వంటి బ్యాక్టీరియా కూడా ఉంటుంది.
అందువల్ల, మొలకలను గర్భవతులు తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు తిమ్మిరి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే కడుపు శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో మొలకలను తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
ఇక మొలకలే కాదు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, బొప్పాయి, పైనాపిల్, పచ్చి గుడ్డు, సగం ఉడికిన మాంసం, ఆల్కహాల్, జున్ను, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
కెనడాలోని ఎన్ఆర్ఐలకు లాస్ట్ ఛాన్స్ .. ఈ వీకెండ్‌లో చివరి బ్యాచ్ కాన్సులర్ క్యాంప్‌లు