గోషామహల్ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతా పై నిషేధం…కారణమేంటంటే!

గోషామహల్ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతా పై నిషేధం…కారణమేంటంటే!

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ వ్యక్తిగత ఖాతా పై ఫేస్ బుక్ నిషేధం విధించినట్లు తెలుస్తుంది.

గోషామహల్ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతా పై నిషేధం…కారణమేంటంటే!

పాలక బీజేపీ నేతల ద్వేష పూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని ఫేస్ బుక్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

గోషామహల్ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతా పై నిషేధం…కారణమేంటంటే!

హింసను, ద్వేషాన్ని రెచ్ఛగొట్టేట్టు ప్రసంగాలు చేసే వ్యక్తులను నిషేధించాలన్న మా పాలసీని ఉల్లంఘించినందుకు ఆయన పై ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు ఈ సోషల్ మీడియా జెయింట్ ప్రతినిధి ఒకరు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.

ఫేస్ బుక్ నియమాలను ఉల్లఘించిన కారణంగానే ఆయన అకౌంట్ ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు.

అయితే ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆయన వ్య‌క్తిగ‌త ఖాతాల‌ను తొల‌గించినట్లు తెలుస్తుంది.వివాదాస్పద నేతగా రాజా సింగ్ అందరికి సుపరిచితులే.

ఇటీవల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆయనకు సెక్యూరిటీ ని కూడా పెంచిన విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత ఖాతా పై నిషేధం విధించడం చర్చనీయాంశమైంది.మరోపక్క రాజా సింగ్ మాత్రం తనకు ఎలాంటి అధికారికమైన ఫేస్‌బుక్ పేజ్ లేదని, తన పేరుమీదుగా చాలా మంది ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారంటూ స్పష్టం చేశారు.