గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తెల్ల చొక్కా,ఎర్ర కండువా,గల్ల లుంగీ ధరించిన, సుమారు 45 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తి మృతదేహం జాతీయ రహదారి పక్కన పడి ఉంది.

ఆత్మహత్యనా లేక రోడ్డు ప్రమాదమా,ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

మృతుని వివరాలు తెలిసిన వారి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని టౌన్ ఎస్ఐ క్రాంతికుమార్ తెలియజేశారు.

షాకింగ్ వీడియో : ఇదేంటి భయ్యా.. ఎయిర్‌పోర్ట్‌లో పీతల సైన్యం..