గుంటూరు కారం అప్పటికి ఫినిష్.. రేపటి నుండి లాంగ్ షెడ్యూల్ స్టార్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''( Guntur Karam ).

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాలు వచ్చాయి.కానీ వాటికీ మేకర్స్ చెక్ పెట్టారు.

"""/" / షూటింగ్( Guntur Karam Shooting ) ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.

ఇక ఈ సినిమా షూట్ గురించి తాజాగా మేకర్స్ నుండి ఒక అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పక్కాగా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు పూర్తి అవుతుందట.

కొత్త షెడ్యూల్ ను రేపటి నుండి స్టార్ట్ చేయనున్నారట.ఇది లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తుంది.

మరి ఈ షెడ్యూల్ లో పెండింగ్ లో ఉన్న సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా షూట్ చేయనున్నారట.

ఈ లాంగ్ షెడ్యూల్ డిసెంబర్ వరకు ఏకధాటిగా సాగనుందని సమాచారం.దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించిన విధంగానే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

కాగా పాన్ ఇండియా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 220 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట.

అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ బిజినెస్( Guntur Karam Pre Business ) కూడా భారీగా జరుగుతుంది.

మహేష్, త్రివిక్రమ్( Trivikram Srinivas ) వల్ల ఈ సినిమాకు అదే రేంజ్ లో క్రేజ్ రాగ బిజినెస్ స్థాయి కూడా పెరిగింది.

"""/" / మరి ఈ సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi Babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు….