గరిడేపల్లి చేపల సొసైటీ ఎన్నిక ఉద్రిక్తత
TeluguStop.com

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల కేంద్రంలో చేపల చెరువు సొసైటీ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకొంది.


చైర్మన్ ఎన్నిక జరగకుండా హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ అడ్డుకుంటున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.


అధికారాన్ని,పోలీసులను అడ్డుపెట్టుకొని చైర్మన్ ఎన్నికకు సంబంధించిన కాగితాలను చింపి వేసి వాయిదా వేయిస్తున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.
మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి వలన గరిడేపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి వలన గరిడేపల్లిలో ముదిరాజ్ గూడెం తగలపడి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైర్మన్ ఎన్నిక కోసం సభ్యులను బెదిరిస్తున్నారని,డబ్బు ఆశ చూపి కొనుగోళ్లకు ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ కు చెందిన బాధితుడు ఆరోపణలు చేయడం గమనార్హం.