కన్నుల పండువగా శోభాయాత్ర…పల్లకి మోసిన సీఎం కేసీఆర్
TeluguStop.com

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్టపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి.


బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్,ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు, ప్రభుత్వ అధికారులు,అర్చకులు,వేదపండితులు పాల్గొన్నారు.


శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు,ఉత్సవ విగ్రహాలు,అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు,కళా ప్రదర్శనలు చేపట్టారు.వేద మంత్రోచ్ఛరణాలు,మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది.
సీఎం దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.
ఇదేం దరిద్రం.. మిగిలిపోయిన ఇండియన్ ఫుడ్‌తో కేక్.. చెఫ్‌పై నెటిజన్లు ఆగ్రహం..