కేటీఆర్ రాష్ట్రంలో సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాస్తా…ఉంటే రాజీనామా చేస్తారా…షర్మిల సవాల్

నల్లగొండ జిల్లా:గత ఏడేళ్లలో కేసీఆర్ రాష్ట్రంలో ఉద్ధరించినదీ లేదు,రాబోయే రోజుల్లో దేశాన్ని ఏలేదీ లేదని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు.

ఏడేళ్లలో కేసీఆర్ నల్లగొండకు చేసింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు? 19% ఉన్నటువంటి ఎస్సీల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం,తన మంత్రివర్గంలో ఎంత మందికి చోటు కల్పించారో చెప్పాలన్నారు.

నవంబర్ 9వ తేదీన ఆగిపోయిన ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల నార్కట్‌పల్లి మండలంలోని కొండపాక గూడెం నుంచి తిరిగి పాదయాత్రను శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ద్రోహం చేయని వర్గమే లేదన్నారు.

రుణమాఫీ చేయకుండా 36 లక్షల మంది రైతులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే,కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ వేయడం వెనక మతలబు ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.

బంగారు తెలంగాణ చేస్తానని,అప్పులు,ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని,అప్పుల రాష్ట్రంగా మార్చి,ప్రతి కుటుంబంపై నాలుగు లక్షల అప్పు వేసిన కేసీఆర్‌కు సిగ్గు ఉండాలని అన్నారు.

కేటీఆర్ తండ్రితో సహా పాదయాత్ర చెయ్ సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాస్తా,సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేయండి అంటూ సవాల్ విసిరారు.

నార్కట్ పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వైయస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ హాజరై మాట్లాడారు.

రాజన్న రాజ్యం కోసం మీ ముందుకు వచ్చిన బిడ్డను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.

షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన వస్తుందని తెలిపారు.అంతకుముందు ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.

వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?