కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు… రేవంత్ రెడ్డి
TeluguStop.com
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సిట్ అధికారులు కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే కేటీఆర్ కు సమాచారం ఎలా అందిందని నిలదీశారు.
కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించక ముందే ఇద్దరే తప్పు చేశారని ఎలా చెప్పారని అడిగారు.
ఆధారాలు ఇవ్వాలని సిట్ తమకు నోటీసులు జారీ చేసిందన్న రేవంత్ రెడ్డి మరి ఆధారాల కోసం మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ వ్యవహారం సరిగా లేదని పేర్కొన్నారు.
ఏపీ అధికారుల నుంచి టిఎస్పిఎస్సి కేసు విచారణను తప్పించాలని డిమాండ్ చేశారు.
వైరల్ వీడియో : పెళ్లిరోజే ఈ రేంజ్ లో ఉంటే.. మరి పెళ్లి అయ్యాక ?