కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదుగుతున్నారు.. పవన్ కల్యాణ్
TeluguStop.com
పశ్చిమగోదావరి జిల్లా బీసీ నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్తున్నారని చెప్పారు.జనసేన అధికారంలోకి రాగానే తూర్పు కాపుల గణాంకాలను వెలికితీస్తామని తెలిపారు.
సమాజంలో అందరినీ సమానంగా చూస్తే కులాల గొడవ ఉండదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తూర్పు కాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారన్న ఆయన కులాన్ని పట్టించుకోకుండా ఆ పేరుతో రాజకీయంగా ఎదుగుతున్నారని విమర్శించారు.
తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాల విషయంలో తారతమ్యాలు ఎందుకని ప్రశ్నించారు.అంతేకాకుండా తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
అయితే రాష్ట్ర విభజనతో బీసీ కులానికి చెందిన కాపులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు.
వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..