కళ్లకలకపై ప్రజలు ఆందోళన చెందవద్దు..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ శాసనమండలిలో కళ్లకలకపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.కళ్లకలకపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్ ఫెక్షన్ కంట్రోల్ నిబంధనలు పాటించే విధంగా తగు జాగ్రత్తలు చూసుకోవాలన్నారు.

దాంతోపాటు ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఆ పని మళ్లీ చెయ్యనని చెబుతున్న సమంత.. ఆ కామెంట్స్ బాగా హర్ట్ చేశాయా?