ఏపీలో దొంగ ఓట్లను తీసేయాల్సిందే..: మంత్రి మేరుగ
TeluguStop.com
ఏపీలో పేదరికం 11.5 నుంచి 6 శాతానికి తగ్గిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదని చెప్పారు.ఏపీ ప్రజలను ఏమార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి మేరుగ ఆరోపించారు.
చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ఫిర్యాదు చేశామన్నారు.రాజ్యాంగ బద్ధంగా ఇచ్చిన హక్కులను కాలరాయొద్దని సూచించారు.
రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లను తీసేయాల్సిందేనన్న మంత్రి మేరుగ అర్హత కలిగిన ఓట్లు ఉండాల్సిందేనని తెలిపారు.
ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పుష్ప 2 హీరో దొంగ కాకపోతే దేవుడా…. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై బన్నీ షాకింగ్ రియాక్షన్?