ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నల్లు ఇంద్రసేనారెడ్డి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ ఎక్స్ రోడ్డులో ఏకలవ్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్ హాజరయ్యారు.

అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఏకలవ్యుడిది మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్రని గుర్తు చేశారు.

తక్కువ కులానికి చెందిన వాడైనందుకు విలువిద్య నేర్పించుటకు ద్రోణుడు తిరస్కరించడంతో నిరాశ చెందకుండా బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వఅధ్యయనం ప్రారంభించి విలువిద్యలో ఆరితేరిన పట్టుదల గల వ్యక్తి అని అన్నారు.

ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు,ద్రోణుడి ప్రియశిష్యుడు అయిన మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడని,అందుకే గురు దక్షిణగా అడగగా,ఏ మాత్రం ఆలోచించకుండా తన కుడిచేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించి చరిత్రలో నిలిచిపోయాడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నల్లు అశోక్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ,తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు రాములన్న,ఎరుకల సంఘ రాష్ట్ర నాయకులు బాలకృష్ణయ్య,కోనేటి నరసింహులు, పోచయ్య,వెంకన్న,రాంనర్సయ్య,తుంగతుర్తి నియోజకవర్గ ఎరుకల సంఘ నాయకులు రాయపూరం వెంకన్న,పొన్నెకల్లు కృష్ణ,గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

రవితేజకు అదే మైనస్ అవుతోందా.. ఆ స్టార్ హీరోలను చూసి రవితేజ మారాల్సిందేనా?