ఎన్టీఆర్‌ మోసం చేసినా.. కోపం లేదు

ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథను అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం చేయాలని దాదాపు అయిదు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు.

చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా స్టార్‌ హీరోతోనే దర్శకుడిగా పరిచయం అవ్వాలనే ఉద్దేశ్యంతో చాలా కాలం వెయిట్‌ చేశాడు.

సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా కళ్యాణ్‌ రామ్‌ ఒక చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్న సమయంలో వారికి వంశీ దృష్టిలో పడ్డాడు.

వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చిత్రం అంటూ కళ్యాణ్‌ రామ్‌ స్వయంగా మీడియా నోట్‌ విడుదల చేయడం జరిగింది.

ఆచిత్రం అదుగో ఇదుగో అంటూ దాటవేస్తూ వచ్చి, చివరకు క్యాన్సిల్‌ అన్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కారణాలు చెప్పకుండానే కళ్యాణ్‌ రామ్‌ ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్‌ చేశాడు అంటూ ఆ మద్య రచయిత వక్కంతం వంశీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

దర్శకుడిగా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎన్టీఆర్‌తో చేయాలనే ఉద్దేశ్యంతో తాను అన్నింటిని పక్కకు పెట్టాను అని, కాని వారు మాత్రం తనను మోసం చేశారు అంటూ అప్పుడు వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజాగా ఈ రచయిత ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రంకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు.

నేడు విడుదలైన ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వంశీ మాట్లాడుతూ మరోసారి ఎన్టీఆర్‌ సినిమా గురించి వ్యాఖ్యలు చేశాడు.

!--nextpage ఎన్టీఆర్‌తో తన మొదటి సినిమా ఉండాలి.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

అయినా కూడా నాకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ద్వేషం కాని, కోపం కాని లేదు.

ఆయన్ను మెప్పించేలా కథను సిద్దం చేస్తాను, తప్పకుండా ఎన్టీఆర్‌తో ఒక చిత్రాన్ని చేస్తాను అంటూ ఈయన ధీమా వ్యక్తం చేశాడు.

అప్పుడు నో చెప్పిన ఎన్టీఆర్‌ ‘నా పేరు సూర్య’ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ అయితే తప్పకుండా పిలిచి మరీ అవకాశం ఇవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

అదే విషయం వంశీ కూడా చెబుతున్నాడు.ఎన్టీఆర్‌ వల్ల తనకు రెండు సంవత్సరాలు వృదా అయ్యిందనే బాధ ఉన్నా కూడా ఒక మంచి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నా పేరు సూర్య’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకు పోవడం ఖాయం అంటున్నారు.

రచయితగా ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న వంశీ దర్శకుడిగా మొదటి సక్సెస్‌ను అందుకుంటాడా, కెరీర్‌లో మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్‌ దక్కించుకుంటాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య