ఎంపీగా ష‌ర్మిళ‌.. ఆ మూడు సీట్ల‌లో ఒక‌టి క‌న్ఫామ్‌!

`జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని నేను` అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ జైల్లో ఉన్న స‌మ‌యంలో ఓదార్పు యాత్ర చేసి పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపిన ష‌ర్మిళ‌.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.ఆమె పేరు పార్టీలో ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇప్పుడు ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆసక్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డం కన్ఫామ్ అని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

అయితే ఎక్క‌డి నుంచి పోటీచేస్తార‌నే విష‌యంలో మాత్రం కొంత సందిగ్దంలో జ‌గ‌న్ ఉన్నార‌ని చెబుతున్నారు.

మ‌రో ప‌క్క‌.ఆమె ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారా లేక కేవ‌లం పార్టీ ప్ర‌చారానికే ప‌రిమిత‌మవుతారా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి!! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబం నుంచి ఇద్ద‌రు మాత్రమే బ‌రిలో ఉన్నారు.

పులివెందుల నుంచి జ‌గ‌న్‌, క‌డ‌ప ఎంపీగా అవినాష్‌రెడ్డి పేర్లు మాత్ర‌మే ఉన్నాయి.ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరితో పాటు ఎవ‌రు పోటీచేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

జగన్‌తో పాటు ఆయ‌న సోద‌రి వైఎస్‌ షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది.

విశాఖ నియోజకవర్గంతో పాటు ఒంగోలు నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే చర్చ మొద‌లైంది.

విశాఖ నియోజకవర్గంలో గెలిచి, గత చేదు అనుభవాన్ని తుడిచేయాలని జగన్‌ పట్టుదలతో ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

గ‌తంలో ఇక్క‌డ ఎంపీగా పోటీచేసిన జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌.ఓడిపోయిన విష‌యం తెలిసిందే! !--nextpage విశాఖలో షర్మిల బరిలో నిలుస్తుందా? లేదా? అనేది ఇంకా స్పష్టతలేదు.

ఇక వైవీ సుబ్బారెడ్డిని పార్టీ కార్యక్రమాలకు మళ్లించి ఒంగోలు నుంచి షర్మిలను బరిలో దించే ఆలోచ‌న‌లోనూ జగన్‌కు ఉన్నార‌నేమాట అడపాదడపా వినిపిస్తోంది.

ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైనది.ఇక్కడ నుంచి షర్మిల పోటీచేస్తే విజయం నల్లేరు మీద నడకే కావొచ్చు.

అయితే అనుకూల నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలవడం పెద్దకథేమీ కాకపోవచ్చు.ఇక‌ కడప ఎంపీ సీటు విషయంలో కూడా షర్మిల పేరు వినిపిస్తోంది.

ఇక్కడి నుంచి ప్రస్తుతం వైఎస్‌ కుటుంబీకుడే అవినాష్‌ రెడ్డి ఎంపీగా ఉన్నాడు.అవినాష్‌కు క్లీన్‌ట్రాక్‌ రికార్డే ఉంది.

దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం ఒక్క‌టే మైన‌స్‌గా క‌నిపిస్తోంది.కడప రాజకీయాలకు మరికాస్త దూకుడు ఉండాలనేది జనాభిప్రాయం.

ఈ నేపథ్యంలో అవినాష్‌కు మరో బాధ్యతలు అప్పగించి, షర్మిలను కడప నుంచి బరిలోకి దించుతారనే ప్రచారమూ ఉంది.

ఇలా విశాఖ, ఒంగోలు, కడప ఎంపీ సీట్ల విషయంలో షర్మిల పేరు వినిపిస్తూ వస్తోంది.

ఈ మూడుచోట్లలో ఎక్కడైనా ఆమె పోటీచేస్తారా? లేక ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండి, ఎన్నికల ప్రచారం మాత్రమే చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

ఇక వచ్చే ఎన్నికలతో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడానికి వైఎస్‌ వివేకానందరెడ్డి ఉత్సాహం చూపిస్తున్నార‌ట‌.

అవసరం అనుకుంటే ఆయన బరిలోకి దిగుతాడని, కడపజిల్లాలోని నియోజకవర్గాల్లో లేదా, పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది.

మొత్తానికి మ‌రోసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి ఈ ఏడాది పోటీచేసేవారి సంఖ్య పెర‌గొచ్చ‌నేది తేలిపోయింది.

Hebah Patel Latest Images-ఎద అందాలతో కుర్రకారును పారేశాను చేస్తున్న..హెబ్బా పటేల్